schedule Monday, July 06, 2026

నగరేశ్వర దేవాలయానికి కొత్త పాలకవర్గం

calendar_today June 8, 2023
person dharshininews
నగరేశ్వర దేవాలయానికి కొత్త పాలకవర్గం
నగరేశ్వర దేవాలయానికి కొత్త పాలకవర్గం - దరఖాస్తుల ఆహ్వానానికి నోటీసులు జారీ - గడువు ఎప్పటి వరకు అంటే తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయం కొత్త పాలకవర్గం ఏర్పాటుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయ శాఖ డిప్యూటి కమీషనర్ ఎం.రామకృష్ణ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయ శాఖ చట్టం సబ్‌ సెక్షన్‌-15 కింద అర్హుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ఆసక్తిగల వ్యక్తులు నోటీసు జారీ చేసిన తేది నుంచి 20 రోజుల్లోపు దరఖాస్తులను చేసుకోవాలని సూచించారు. చట్టంలోని సెక్షన్‌ -17లోని సబ్ సెక్షన్‌(3) కింద ఫారమ్-2 ను పూరించి దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా డిప్యూటి కమీషనర్‌ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఆసక్తిగల ఆశావాహులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రస్తుతం దేవాలయ పాలకవర్గ చైర్మన్‌ గా పట్టణానికి చెందిన కుంచెం మురళీధర్ కొనసాగుతున్నారు. కొత్త పాలకవర్గ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా ఎవరు నియామకం అవుతారనేది ఆసక్తిగా మారింది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17659 chaithany collage