schedule Monday, July 06, 2026

వీరశైవ సమాజంకు తోడ్పాటు

calendar_today June 9, 2023
person dharshininews
వీరశైవ సమాజంకు తోడ్పాటు
వీరశైవ సమాజంకు తోడ్పాటు - ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి - సమాజం నూతన కార్యవర్గానికి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని వీరశైవ సమాజం అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో వీరశైవ సమాజం నూతన అధ్యక్షులు ఆర్.బస్వరాజ్, గౌరవాధ్యక్షులు వాలి శాంతుకుమార్, ప్రధాన కార్యదర్శి లింగదలి రవికుమార్, కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాండూరులోని వీరశైవ సమాజం అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించడం జరిగిందని గుర్తుచేశారు. సమాజం కళ్యాణ మండపంకు సహకారం అందించినట్లు తెలిపారు. ఇక ముందు షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు సమాజం కు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, డిసిసిబి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు మసూద్, సమాజం ఉపాధ్యక్షులు సడి భద్రప్ప, సహాయ కార్యదర్శి అబులం సంపత్ కుమార్, కోశాధికారి వాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17720 chaithany collage