schedule Monday, July 06, 2026

వీరశైవులను ఓబీసీలో చేర్చేందుకు కృషి

calendar_today June 11, 2023
person dharshininews
వీరశైవులను ఓబీసీలో చేర్చేందుకు కృషి
వీరశైవులను ఓబీసీలో చేర్చేందుకు కృషి - సమాజం సభ్యులు అన్ని రంగాల్లో రాణించాలి - రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ - తాందూరు సమాజం కార్యవర్గానికి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వీరశైవులను ఓబీసీలో చేర్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరశైవ సమాజం నూతన కార్యవర్గం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఆదివారం పట్టణంలోని భద్రేశ్వరాలయంలో వీరశైవ సమాజం నూతన కార్యవర్గ సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ హాజరై నూతన కార్యవర్గాన్ని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ గతంలో మాదిరిగానే వీరశైవ సమాజం నూతన కార్యవర్గ సభ్యులు సమాజంలోని పేదవాళ్ల అందరి అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వీరశైవులను ఓబీసీలను చేర్చేందుకు కృషి చేయడం జరిగిందని, ప్రభుత్వం తరుపున ఢిల్లీలోని నేషనల్ బీసీ కమీషన్ కు నివేధిక అందించడం జరిగిందన్నారు. దీనిపై ఎన్ఫీబీసీ హామి ఇచ్చిందని గుర్తుచేశారు. అదేవిధంగా వీరశైవుల అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాజం అధ్యక్షులు ఆర్, బస్వరాజ్, గౌరవాధ్యక్షులు వాలి శాంతుకుమార్, ప్రధాన కార్యదర్శి లింగదలి రవికుమార్, మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, భద్రేశ్వరాలయ చైర్మన్ బంటారం సుధాకర్, సభ్యులు తంబాకు చంద్రశేఖర్, అబులం సంపత్, పరమేశ్వర్, శెట్టి భాస్కర్, వాలి శ్రావణ్, గంగా శ్రావణ్, గౌరీ శంకర్, బాలీ వీరేందర్, యువదళ్ ' అధ్యక్షులు అభిషేక్, వినోద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/17789 chaithany collage