schedule Monday, July 06, 2026

ముదిరాజ్‌లకు ఆర్థిక సాయం వర్తింపజేయాలి

calendar_today June 11, 2023
person dharshininews
ముదిరాజ్‌లకు ఆర్థిక సాయం వర్తింపజేయాలి
ముదిరాజ్‌లకు ఆర్థిక సాయం వర్తింపజేయాలి - మత్స్యకారులకు రూ. 1 లక్ష అందించాలి - యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రాము ముదిరాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం బీసీ చేతి, కుల వృత్తి దారులకు అందజేస్తున్న రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని ముదిరాజ్ కులస్తులకు వర్తింప చేయాలని ముదిరాజ్ యువజన సంఘం తాండూరు ప్రధాన కార్యదర్శి రాము ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గంలో కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అమలు చేయడం శుభపరిణామన్నారు. అయితే ముదిరాజ్ వర్గంలోని కులస్తులకు కూడా ఈ సాయాన్ని వర్తింప చేయాలన్నారు. ముదిరాజ్ లోని మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి రూ. 1 లక్ష సాయం ఇవ్వాలన్నారు. అది కూడా మొదటి విడతలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/17789 chaithany collage