schedule Monday, July 06, 2026

ప్రగతి సంబరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

calendar_today June 15, 2023
person dharshininews
ప్రగతి సంబరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రగతి సంబరాలకు పకడ్బందీ ఏర్పాట్లు - రేపు కొత్త మున్సిపల్‌లో వేడుకలు - మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో పట్టణ ప్రగతి ఉత్సవాలను అదిరేలా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోందన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు శుక్రవారం తాండూరులో పట్టణ ప్రగతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి బోనాలతో ర్యాలీ ఉంటుందని, ఇందిరా చౌరస్తాలో మానవహారం నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్కడి నుంచి కొత్త మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేరుకుంటుందన్నారు. ఉదయం 11 గంటలకు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. అనంతరం సలాం సఫాయి, పట్టణ ప్రగతిలో సాధించిన ప్రగతిపై వివరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డీఓ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. కావున పట్టణానికి చెందిన పార్టీల నాయకులు, పురప్రముఖులు, సంఘాల ప్రతినిధులు, యువకులు, మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17899 chaithany collage