schedule Monday, July 06, 2026

ప్లాట్‌ కొంటారా.. భూమి కొంటారా..!

calendar_today June 17, 2023
person dharshininews
ప్లాట్‌ కొంటారా.. భూమి కొంటారా..!
ప్లాట్‌ కొంటారా.. భూమి కొంటారా..! - జిల్లా వాసులకు సర్కారు ఆఫర్ - మళ్లీ రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం - అల్లాపూర్‌, వికారాబాద్‌లలో భూముల అమ్మకం - ప్రకటించిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ వికారాబాద్/తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్లాట్‌ కొంటారా.. లేదా భూమి కొంటారా.. అనే విధంగా వికారాబాద్‌ జిల్లా వాసులకు బంపర్‌ ఆఫర్ ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ ప్లాట్లు, ప్రభుత్వ భూములకు వేలం నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తాండూరు పట్టణ సమీపంలోని మనోహా టౌన్‌ షిప్‌ ఆధ్వర్యంలో రాజీవ్ స్వగృహ ప్లాట్లను వేలం వేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా రెండు సార్లు రాజీవ్‌ స్వగృహ ప్లాట్లు, ఓపెన్‌ ప్లాట్లను వేలం వేశారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 14 ప్లాట్లు, 54 ఇండ్లకు వేలం వేడయం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తాండూరు మండలం అల్లాపూర్‌ గ్రామ సమీపంలోని సర్వేనెంబర్ 109లోని 26 ఎకరాలకు కూడా బహిరంగ వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఈనెల 24తేదిన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రీబిడ్డింగ్ మొదటి సమావేశం, వచ్చేనెల 1న రెండో ఫ్రీబిడ్డింగ్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వచ్చేనెల 11న వేలం జరుగుతుందని తెలిపారు. మరోవైపు వికారాబాద్‌ మండలం అల్లంపల్లి గ్రామంలోని 15 ఎకరాలకు కూడా వేలం వేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ఈనెల 24తేదిన వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ప్రీబిడ్డింగ్ మొదటి సమావేశం, వచ్చేనెల 1న రెండో ఫ్రీబిడ్డింగ్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వచ్చేనెల 13న వేలం వేడయం జరుగుతుందని తెలిపారు. ఆసక్తిగల ప్రజలు ఈ ఫ్రీ బిడ్డింగ్, వేలంలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17963 chaithany collage