schedule Monday, July 06, 2026

తొమ్మిదేండ్ల పాలనంతా దగానే...!

calendar_today June 22, 2023
person dharshininews
తొమ్మిదేండ్ల పాలనంతా దగానే...!
తొమ్మిదేండ్ల పాలనంతా దగానే...! - హామీలు నెరవేర్చని దశాబ్ది ఉత్సవాలు ఎందుకు - రావణ వధతో సీఎం కేసీఆర్ బొమ్మ దహనం - టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహరాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లు పాలించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందరిని దగా చేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం దగా దశాబ్ది రావణ వధ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహరాజ్, రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ కోఆర్డినేటర్ యాదగిరి గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పది తలలతో రూపొందించిన సీఎం కేసీఆర్ రావణ వధ బొమ్మను దహనం చేశారు. పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ రాజ్ తో పాటు పలువురు మాట్లాడుతూ కొట్లాది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలను విస్మరించారని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, అమర వీరుల గుర్తింపు వంటి తదితర హామిలను ఇప్పటికి నెరవేర్చలేదని విమర్శించారు. ఎం సాధించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారని ప్రశ్నించారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వర్గ పోరుతో అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. దీంతో తాండూరు ప్రగతి శూన్యంగా మారిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://dharshininews.com/18049 chaithany collage