schedule Monday, July 06, 2026

ఖబడ్దార్ కౌషిక్ రెడ్డి..!

calendar_today June 25, 2023
person dharshininews
ఖబడ్దార్ కౌషిక్ రెడ్డి..!
ఖబడ్దార్ కౌషిక్ రెడ్డి..! - క్షమాపణ చెప్పకుంటే ముదిరాజ్‌ల తడాఖా చూపిస్తాం - ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ - తాండూరులో కౌషిక్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం తాండూరు, దర్శిని ప్రతినిధి: ముదిరాజ్‌లపై అనుచిత వాఖ్యలకు చేసినందుకు ఎమ్మెల్సీ కౌషిక్‌ రెడ్డికి తాండూరు ముదిరాజ్‌లు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఆదివారం తాండూరు ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుండి, ఇందిరా చౌక్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. మ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చౌరస్తాలో కౌషిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముదిరాజ్‌ల పట్ల అనుచిత వాఖ్యలకు పాల్పడిన పాడి కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కౌషిక్‌ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ముదిరాజుల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్టేషన్‌కు వెళ్లి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు, ఈ కార్యక్రమంలో బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి, వికారాబాద్ జిల్లా ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు లొంక నర్సింహులు, తాండూరు నియోజకవర్గం ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు ఎస్పీ రవికాంత్, పట్టణ ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, కార్యదర్శి రాము, తాండూరు మండల అధ్యక్షులు జగదీష్, యాలాల మండల అధ్యక్షులు హనుమంతు, బాతుల భీమ్ శంకర్, అశోక్, దోమ కృష్ణ, టిల్లు, రమేష్, బసంత్, ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/18091 chaithany collage