schedule Monday, July 06, 2026

జోహార్ దొడ్డి కొమురయ్య..!

calendar_today July 4, 2023
person dharshininews
జోహార్ దొడ్డి కొమురయ్య..!
జోహార్ దొడ్డి కొమురయ్య..! - తాండూరులో ఘనంగా వర్ధంతి - నివాళులు అర్పించిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్యకు తాండూరు కురుమ సంఘం నేతలు జోహర్లు అర్పించారు. మంగళవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణం నెహ్రు గంజ్లోని నాగారం నర్సింలు అడ్తి దుకాణంలో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కురుమ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్, సంఘం సభ్యులు దొడ్డి కొమురయ్య చిత్రానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరులో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కణకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా గొల్ల కురుమలకు సొంత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డివిజన్ అధ్యక్షులు నాగారం జగదీష్, ఉపాధ్యక్షులు పూజారి పాండు, ప్రధాన కార్యదర్శి ఇందూరు మల్లేషం, నాగులపల్లి నర్సింలు, ఇందూరు బాలు, శ్రీశైలం, శివప్ప, హమ్మయ్య, నర్సింలు, వీరేశం, గొల్ల బీరప్ప, మిట్టి మహేష్, గుండప్ప, ఉల్లి నర్సింలు, భామతేజ, నాగప్ప, వాగులపల్లి శ్రీసు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18306 chaithany collage