schedule Tuesday, September 22, 2026

యాగంలో విద్యార్థుల దైవభక్తి

calendar_today July 4, 2023
person dharshininews
యాగంలో విద్యార్థుల దైవభక్తి
యాగంలో విద్యార్థుల దైవభక్తి - సేవ చేసిన తాండూరు చైతన్య విద్యార్థులు - అభినందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజల క్షేమం కోసం తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న మహా యాగంలో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు దైవభక్తిని చాటుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల, శతచండి, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో విద్యార్థులు వాలింటర్లుగా పాల్గొని సేవలందించారు. మహా యాగంలో విద్యార్థులకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. 11 రోజులు నిర్వహిస్తున్న యాగం విజయవంతం కావాలని తాండూరు నియోజకవర్గం ప్రజలందరికీ మంచి జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. దైవకార్యాలతో విద్యార్థులకు చదువుతోపాటు చక్కటి క్రమశిక్షణ, సంస్కృతి వస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18313 chaithany collage