schedule Monday, July 06, 2026

అతిరుద్ర మహాయాగంలో గరికపాటి నర్సింహారావు

calendar_today July 5, 2023
person dharshininews
అతిరుద్ర మహాయాగంలో గరికపాటి నర్సింహారావు
అతిరుద్ర మహాయాగంలో గరికపాటి నర్సింహారావు - ఆకట్టుకున్న ప్రవచనాలు - సన్మానించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల, శతచండి, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగానికి ప్రముఖ తెలుగు రచయిత, ప్రవచకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నర్సింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గరికపాటి నర్సింహారావు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా గరికపాటి నర్సింహారావు ఎమ్మెల్యే నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగాన్ని సందర్శించారు. యాగంలో ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికలో గరికపాటి నర్సింహారావు ప్రవచనాలను వినిపించారు. కార్యక్రమానికి హాజరైన పట్టణ ప్రముఖులు, నేతలు, మహిళలు గరికపాటి ప్రవచనాలను ఆసక్తిగా విన్నారు. గరికపాటి ప్రవచనాలు శ్రవణానందాన్ని పంచాయి. మరోవైపు యాగానికి హాజరైన గరికపాటి నర్సింహారావును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18358 chaithany collage