schedule Monday, July 06, 2026

బొడ్రాయి ప్రతిష్ట.. తాండూరుకు రక్ష

calendar_today July 8, 2023
person dharshininews
బొడ్రాయి ప్రతిష్ట.. తాండూరుకు రక్ష
బొడ్రాయి ప్రతిష్ట.. తాండూరుకు రక్ష - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ - ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్ పర్సన్ తాండూరు, దర్శిని ప్రతినిధి: బొడ్రాయి ప్రతిష్టతో తాండూరుకు రక్ష కలగాలని స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ అన్నారు. తాండూరు పట్టణం భద్రేశ్వర చౌరస్తాలో గత రెండు రోజులుగా బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతున్నాయి. శనివారం బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలకు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ మాట్లాడుతూ బొడ్రాయి ప్రతిష్టాపనలో శాస్త్రీయత, సంస్కృతి, సంప్రదాయాలు దాగిఉన్నాయన్నారు. గ్రామాల్లో ప్రతిష్టించే బొడ్రాయితో ఊరికే రక్షణ లభిస్తుందన్నారు. అదేవిధంగా తాండూరులో ప్రతిష్టించే బొడ్రాయి ప్రతిష్టాపనతో పట్టణానికి మొత్తం రక్షణ కలగాలని, ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18404 chaithany collage