schedule Monday, September 21, 2026

మోడీని విమర్శించే స్థాయి ఎమ్మెల్యేది కాదు

calendar_today July 14, 2023
person dharshininews
మోడీని విమర్శించే స్థాయి ఎమ్మెల్యేది కాదు
మోడీని విమర్శించే స్థాయి ఎమ్మెల్యేది కాదు - తప్పును కప్పిపుచ్చుకోవడం అవివేకం - ఎమ్మెల్యే తీరును మార్చుకోవాలి - బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశానికి దిక్సూచీగా నిలుస్తున్న ప్రధాని నరేంద్రమోడిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యేది కాదని, ఆకాశమంత స్థాయి ఉన్న పీఎం హోదా ముందు ఎమ్మెల్యే స్థాయి అణువంతే అని బీజేపీ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌ కుమార్ అన్నారు. సెక్యూరిటితో రీల్స్ చేసి వివాదంలో చిక్కుకున్న తాండూరు ఎమ్మెల్యే ప్రధాని మోడితో పోల్చుతూ విమర్శలు చేయడాన్ని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో ఖండించారు. భద్రతా సిబ్బంది చేత ఫొటో షూట్ చేయించుకోవడం, విధులను దుర్వినియోగం చేయడమే కాకుండా దేశ ప్రధానిపై విమర్శలు చేయడం పద్దతి కాదన్నారు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దేశానికి దిక్సూచీగా నిలిచిన పీఎం మోడిపై విమర్శలు చేయడం అవివేకం అని అన్నారు. ఆకాశమంత హోదా ఉన్న పీఎం మోడీ ముందు మీరెంత, అణువంత కూడా కాదన్నారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలతో రాజకీయ పబ్బం గడపాలని ప్రయత్నంచేస్తున్నారు అని అన్నారు. దేశప్రధాని గురించి మాట్లాడితే స్థాయి పెరుగుతుందని భావిస్తున్నారని అన్నారు. బాధ్యతాయుతమైన హోదాలో శాసనసభ్యుడిగా ఉంటూ ఇలాంటి విమర్శలు చేసే వైఖరిని మార్చుకోవాలని సూచించారు. తాండూరు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, తాండూరు ఖనిజ సంపదను దోపిడి నియంత్రణలో శ్రద్ద చూపించాలన్నారు. గిరిజన తాండాలోని సమస్యలు, ఆగిపోయిన గాజీపూర్ బ్రిడ్జీ సమస్యలపూ చూపించాలన్నారు. chaithany collage