schedule Monday, July 06, 2026

అనుగ్రహించు.. శనీశ్వరా..!

calendar_today July 15, 2023
person dharshininews
అనుగ్రహించు.. శనీశ్వరా..!
అనుగ్రహించు.. శనీశ్వరా..! - భూకైలాస్ లో శనిత్రయోదశి పూజలు -  మొక్కులు తీర్చుకున్న భక్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అనుగ్రహించూ శనీశ్వరా అంటూ భక్తులు దేవున్ని వేడుకున్నారు. తాండూరు మండలం అంతారం గాండాలోని భూకైలాస్ దేవాలయంలో శనిత్రయోదశి శోభ సంతరించుకుంది. శనివారం శనిత్రయోదశి సందర్భంగా ఆలయంలో ప్రతిష్ఠించిన శనీశ్వరునికి భక్తులు పూజలు నిర్వహించారు. శనిత్రయోదశి రోజున స్వామి అనుగ్రహం కోసం పూజలు నిర్వహించాలని నియయం ఏర్పడింది. దీంతో మీనం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంబ రాశుల వారు ఉదయం నుంచి దేవాలయంలో పూజలు నిర్వహించారు. సొరంగా మార్గంలో జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. దేవాలయ ప్రాంగణంలోని దేవతామూర్తలందరికి దర్శించుకున్నారు. శనిత్రయోదశి సందర్భంగా శనీశ్వరునికి నియమాలతో స్వామి అనుగ్రహం కోసం ఆలయ అర్చకులు రవిశంకర్ పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల పూజలతో భూకైలాస్‌లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18561 chaithany collage