schedule Sunday, September 20, 2026

బోనాల పండగకు ముస్తాబు

calendar_today July 15, 2023
person dharshininews
బోనాల పండగకు ముస్తాబు
బోనాల పండగకు ముస్తాబు - రేపటి నుంచి కాళికాదేవి ఆలయంలో జాతర - ఏర్పాట్లు చేసిన పాలకమండలి, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి ఆలయం బోనాల పండగకు ముస్తాబయ్యింది. ప్రతి యేడాది మాదిరిగానే ఈ సారి కూడ నిర్వహించే అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జాతర ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లను సిద్దం చేసినట్లు ఆలయ ఈఓ నరేందర్ తెలిపారు. బోనాలు, జాతర ఉత్సవాలలో భాగంగా ఆలయ చైర్మన్ ఆకుల రాములు, డైరెక్టర్లు సంతోష్ కుమార్, రవీందర్ సమక్షంలో 16వ తేదీన అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం బోనాల ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. 17వ తేదిన కుంకుమార్చన, శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, మధ్యాహ్నం అమ్మవారి ఉత్సవ సేవ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18564 chaithany collage