schedule Monday, July 06, 2026

తాండూరులో అద్బుతం..!

calendar_today July 18, 2023
person dharshininews
తాండూరులో అద్బుతం..!
తాండూరులో అద్బుతం..! - ఒకేరోజు రెండు చోట్ల విరబూసిన బ్రహ్మకమలాలు - సాయిపూర్, మారికాంబ కాలనీలో ప్రత్యక్షం - పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు పట్టణంలో అద్భుతం జరిగింది. ఎక్కడో హిమాలయ ప్రాంతాలకే పరిమితమైన బ్రహ్మ కమలాలు తాండూరులో విరబూసాయి. ఒకే రోజు రెండు చోట్ల వికసించిన ఈ అరుదైన పుష్పాలకు పూజలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే... తాండూరు పట్టణం మారికాంబ కాలనీలో రిటైర్డ్ లెక్చరర్ డా. మల్లేశం నివాసంలో బ్రహ్మకమలం చెట్టును పెంచుతున్నారు. అదేవిధంగా పట్టణంలోని సాయిపూర్ ఎక్సైజ్ కార్యాలయం సమీపంలో ఉన్న వ్యాపార వేత్త మల్లేశం ఇంట్లో కూడ బ్రహ్మకమలం చెట్టును పెంచుతున్నారు. సోమవారం రాత్రి మారికాంబ కాలనిలోని డా. మల్లేశం నివాసంతో పాటు సాయిపూర్ లోని మల్లేశం నివాసంలో బ్రహ్మ కమలాలు విరబూశాయి. పవిత్రమైన మొక్కకు బ్రహ్మ కమలాలు వికసించడంతో ఆయా నివాసాల్లోని కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. బ్రహ్మ కమలాలను తిలకించేందుకు వారి నివాసాలకు కాలనీల ప్రజలు తరలివచ్చి దర్శించుకున్నారు. పూజలు కూడ నిర్వహించారు. హిందూ సంప్రదాయాలలో ఎంతో విశిష్ట ఉంది. బ్రహ్మ కమలం అంటే శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిందని పురాణాల్లో ఉంది. ఈ కమలం నుంచే బ్రహ్మదేవుడు జన్మించారని నమ్ముతారు. అంతేకాకుండా ఈ పుష్పాన్ని చూడడం ద్వారా అనేక మానసిక రుగ్మతలు, అనారోగ్యాలు తొలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వికసించిన కొద్దిసేపటి తరువాత ఈ పుష్పాలు వాడిపోయాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18646 chaithany collage