schedule Sunday, September 20, 2026

కూలిన బతుకుకు ఆర్థిక చేయూత

calendar_today July 19, 2023
person dharshininews
కూలిన బతుకుకు ఆర్థిక చేయూత
కూలిన బతుకుకు ఆర్థిక చేయూత - నర్సమ్మకు రూ. 5వేల సాయం - అందజేసిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి పైకప్పు కూలిపోయి బాధపడుతున్న పేద కుటుంబానికి బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ఆర్థిక చేయూతను అందించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించారు. పట్టణంలోని 15వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతం నీరటి నర్సింలు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో కూలీ పనులు చేసుకునే నర్సమ్మ ఆమె పిల్లలు నందిని, మనోహర్, నిరంజన్, దినేష్ లతో ఉంటుంది. గత రెండు రోజుల క్రితం ఇటీవల కురిసిన వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి వారు గాయాలపాలయ్యారు. బుధవారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) నర్సమ్మను, పిల్లలను పరామర్శించారు. కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. త్వరలోనే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శిస్తారని, కుటుంబానికి అండగా ఉంటారని భరోసా అందించారు. అప్పూ వెంట బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు ఉదయ్ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18681 chaithany collage