schedule Monday, July 06, 2026

జోరువాన..!

calendar_today July 20, 2023
person dharshininews
జోరువాన..!
జోరువాన..! - తడిసి ముద్దయిన తాండూరు - జలమయమైన రహదారులు - నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం చూపిస్తోంది. బారీ వర్షాలతో తాండూరు పట్టణం తడిసి ముద్దయ్యింది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేని వర్షంతో పట్టణ వాసులు అతలాకుతలం అవుతున్నారు. బుధవారం నుంచి ప్రారంభమైన వర్షం గురువారం ఉదయం నుంచి కూడా ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. ఏకదాటిగా కురిసిన జోరు వర్షంతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలయమయం అయ్యాయి. గోతులతో ఉన్న రోడ్లు వర్షపునీరుతో నిండుకున్నాయి. వర్షం కారణంగా వాహనాల రాకపోకలు సంబించడంతో పాటు గోతుల వల్ల వాహనదార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక తాండూరు మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్, మల్ రెడ్డిపల్లి, సాయిపూర్, ఆదర్శనగర్, పాత తాండూరు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు వర్షపునీరుతో నిండుకున్నాయి. మురుగుకాలువలు పొంగిపొర్లాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ భారీ వర్షంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18697 chaithany collage