schedule Monday, July 06, 2026

భళా బీఆర్ఎస్ సైన్యం..!

calendar_today July 20, 2023
person dharshininews
భళా బీఆర్ఎస్ సైన్యం..!
భళా బీఆర్ఎస్ సైన్యం..! - వర్షం బాధితులకు భరోసా - మల్కాపూర్‌లో సహాయక చర్యలు - కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన సహాయక చర్యలతో భళా అనిపించుకున్నారు. తాండూరు మండలం బీఆర్ఎస్ నేతలు ఈ గౌరవాన్ని పొందారు. గత మూడు రోజులుగా తాండూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో మండలంలోని మల్కాపూర్‌ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు సహాయక చర్యలు చేపట్టారు. తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ తదిరులు గ్రామంలో పర్యటించారు. స్థానిక నేతలు, యువకులతో కలిసి సైన్యంగా గ్రామంలోని భవాని కాలనీ లో పర్యటించి ప్రజలకు తగు జాగ్రత్తలు, సూచనలు చేశారు. గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో భవానీ నగర్‌లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో చంద్రశేఖర్ గౌడ్, హసన్‌ పటేల్‌ లు కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రజలను పలకరించారు. వర్షాల వల్ల ఇండ్లలోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టులో ఉన్న ఇండ్లలోని సామాగ్రిని సురక్షితంగా ఉండేలా సహాయక చర్యలు అందించారు. ఇండ్లలోకి నీరు వచ్చే బాధితులు సురక్షితంగా ఉండాలని, అవసరమైతే సంప్రదించాలని అన్నారు. అన్ని వేళలలో అండగా ఉంటామని భరోసా అందించారు. నేతలు అందించిన భరోసాతో పాటు సహాయక చర్యలకు కాలనీ వాసులు అభింనదించారు. అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘు గౌడ్, తుల్జప్ప, లక్ష్మప్ప, రమేష్, మాలిక్, బాబా, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18706 chaithany collage