schedule Monday, July 06, 2026

వర్షంలో కొట్టుకొస్తున్న చేపలు

calendar_today July 21, 2023
person dharshininews
వర్షంలో కొట్టుకొస్తున్న చేపలు
వర్షంలో కొట్టుకొస్తున్న చేపలు - మల్కాపూర్‌లో యువకుడికి చిక్కిన ఫిష్‌ - వాగును పరిశీలించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వానొచ్చెనంటే.. వరదొస్తాది.. వరదొచ్చెనంటే.. భారీగా చేపలు వస్తాయి అంటున్నారు గ్రామస్థులు. తాండూరులో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షంతో పాటు చేపలు కొట్టుకొస్తున్నాయి. తాండూరు మండలంలో చేపలు చిక్కిన సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో మండలంలోని ఐనెల్లి, బెల్కటూర్, అల్లాపూర్ వాగులు పొంగి పోర్లుతున్నాయి. అదేవిధంగా మండలంలోని మల్కాపూర్‌లో కూడా వాగులు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈవాగులో భారీ వరద నీరుతో పాటు పెద్ద పెద్ద చేపలు కొట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో మల్కాపూర్ గ్రామానికి చెందిన కల్లూరు మహేష్‌ అనే యువకుడికి భారీ చేప చిక్కింది. గ్రామంలో పెద్ద చేపను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. శుక్రవారం ఉదయం నేతలు, గ్రామస్తులు వాగును సందర్శించారు. వాగులో కొట్టుకొస్తున్న చేపలను కూడా తిలకించారు. ఇందులో రకరకాల చేపలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. వాగులో కొట్టుకొచ్చిన చేపలను గ్రామస్తులు ఇంటికి తీసుకెళ్లారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18730 chaithany collage