schedule Sunday, September 20, 2026

గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌కు అండ

calendar_today July 24, 2023
person dharshininews
గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌కు అండ
గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌కు అండ - సమస్యల పరిష్కారానికి సంపూర్ణ కృషి - బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ కు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి సంపూర్ణ కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ నూలి శుభప్రద్ పటేల్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం రాత్రి శుభప్రద్ పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ అసోసియేషన్ సభ్యులతో సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా అసోపోయేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు డాక్టర్ జాఫర్ లను శుభప్రద్ పటేల్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వహాబ్, గోపాల్, మహమ్మద్ యూసుఫ్, గఫార్, జహూర్, శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు ఆబిద్ చావుస్, భాను, కుర్వ బాలు, విజయ్, హరీష్, శ్రీశైలం, ప్రశాంత్, సచిన్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18803 chaithany collage