schedule Monday, July 06, 2026

మంత్రులనే ఎదురించా..!

calendar_today July 27, 2023
person dharshininews
మంత్రులనే ఎదురించా..!
మంత్రులనే ఎదురించా..! - అడ్డంకులు సృష్టించినా తగ్గను - తాండూరు ప్రజా సేవకే అంకితమవుతా - రాష్ట్ర బీసీ కమీషన్‌ మెంబర్ శుభప్రద్ పటేల్ - తాండూరులో ఘనంగా జన్మదిన వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో మంత్రులను ఎదురించానని, తనను అణగదొక్కేందుకు అడ్డంకులు సృష్టించినా తగ్గేది లేదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. గురువారం తాండూరులో శుభప్రద్ పటేల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరులోని నిర్వహించిన వేడుకలకు శుభప్రద్‌ పటేల్ హాజరయ్యారు. పట్టణంలోని భద్రేశ్వర దేవాయలంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అభిమానులతో ఇందిరా చౌరస్తా వద్దకు చేరుకుని తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని ఏఆర్ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశానికి శుభప్రద్‌ పటేల్ వికారాబాద్‌ జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ బైండ్ల విజయ్ కుమార్, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్‌ మాట్లాడుతూ మన ప్రాంత ప్రజలకు, యువతకు న్యాయం జరగాలనే తెలంగాణ ఉద్యమంలో పోరాటడం జరిగిందన్నారు. ఉద్యమ సమంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులను ఎదురించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. తాండూరు ప్రాంత ప్రజల కోసం నిస్వార్థంగా కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే నూలి శుభప్రద్ పటేల్ ట్రస్ట్ ద్వారా. సామాజిక సేవలతో పాటు విద్య రంగంలోని విద్యార్థులకు, యువతకు ప్రోత్సహించడం జరిగిందన్నారు. త్వరంలోనే తాండూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటామని, తాండూరు ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. త్వరలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను ఏకం చేసేందుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. తనపై ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కితగ్గేది లేదని అన్నారు. మరోవైపు కార్యక్రమంలో విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. అంతకుముందు బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ను బీసీ సంఘం, కురుమ సంఘం, వీరశైవ సంఘం, మైనార్టీ నేతలు, తదితర సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నేతలు, యువకులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18879 chaithany collage