schedule Monday, July 06, 2026

లంబాడిల జోలికోస్తే ఖబడ్దార్..!

calendar_today July 27, 2023
person dharshininews
లంబాడిల జోలికోస్తే ఖబడ్దార్..!
లంబాడిల జోలికోస్తే ఖబడ్దార్..! - ఎస్టీల నుంచి తొలగించే కుట్రలను సహించం - అనిల్ రాథోడ్ యువసేన అధ్యక్షులు అనిల్ రాథోడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్టీలోని లంబాడిల జోలికి వస్తే ఖబడ్దార్ అని అనిల్ రాథోడ్ యువసేన అధ్యక్షులు అనిల్ రాథోడ్ అన్నారు. ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలను తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన వాఖ్యలను గురువారం అనిల్ రాథోడ్ ఓ ప్రకటనలో ఖండించారు. ఎస్టీలోని అన్ని తెగలవాళ్లు అందరు కలిసి మెలిసి ఉంటున్నారని అన్నారు. కేంద్రం మణిపూర్‌లో లాగా ఎస్టీల మద్య చిచ్చుపెట్టే కుట్ర చేస్తోందని విమర్శించారు. ఎస్టీలోని లంబాడీలను తొలగించాలని ఎంపీ సోయం బాపురావు అన్యాయమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి కుట్రలు పన్నితే సహించలేమన్నారు. ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను మానుకోవాలన్నారు. అదేవిధంగా ఎలాంటి కుంత్రాలను ఎస్టీలు ఎవ్వరు నమ్మరాదని, తిప్పి కొట్టేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18884 chaithany collage