schedule Monday, July 06, 2026

వైభవంగా రుక్మిణీ, పాండురంగ కళ్యాణం

calendar_today July 30, 2023
person dharshininews
వైభవంగా రుక్మిణీ, పాండురంగ కళ్యాణం
వైభవంగా రుక్మిణీ, పాండురంగ కళ్యాణం - భక్తి శ్రద్ధలతో పంచసూక్త హోమాలు - బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆధిక శ్రావణ మాసం సందర్భంగా తాండూరు బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మీణీ, పాండురంగ స్వామి కళ్యాణం, పంచసూక్త హోమాలు, పూజలు నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ పాండురంగ స్వామి దేవాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మద్య పంచసూక్త హోమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ హోమాల్లో దంపతులు, బ్రహ్మాణులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రుక్మిణీ పాండురంగ సమేతంగా స్వామి వార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుదీక్షిత్, గురురాజ్ జోషీ, శ్రీనివాస్ రావు జోషీ, మాణిక్ రావు, హయ్యాళ్ దత్తాత్రేయ రావు, ప్రదీప్ కుమార్, మంగళదేవి, గోనూర్ రాఘవేంద్ర, సంధ్యారాణి, రాఘవేందర్ జోషీ, బ్రాహ్మణ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18919 chaithany collage