schedule Monday, July 06, 2026

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్

calendar_today August 3, 2023
person dharshininews
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ - రైతు రుణమాఫీ హర్షనీయం - తాండూరులో కేసీఆర్ చిత్రానికి పాలాభిషేకం తాండూరు, దర్శిని ప్రతినిధి: రైతు సంక్షేమానికి కృషి చేస్తూ సీఎం కేసీఆర్ రైతుల పాలిట రైతు బాంధవుడు అయ్యారని తాండూరు బీఆర్ఎస్ నేతుల, రైతులు అభివర్ణించారు. గురువారం తాండూరు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆప్పూ(నయూం) ఆధ్వర్యంలో పట్టణంలోని నెహ్రు గంజ్ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భగా పలువురు మాట్లాడుతూ దేశంలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు ద్వారా పంటలకు పెట్టుబడి, రైతులకు బీమా పథకాలను అమలు చేసి రైతుల వ్యవసాయాన్ని పండగలా మార్చారని అన్నారు. తాజాగా రైతులకు రూ. 1 లక్ష రుణమాఫీ చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. రైతులందరు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, కౌన్సిలర్లు విజయాదేవి, సుమిత్ గౌడ్, ఉపట్టణ ఉపాధ్యక్షులు హరి హర గౌడ్, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19011