schedule Sunday, September 20, 2026

వైభవంగా అన్నకూట్ మహోత్సవం

calendar_today August 3, 2023
person dharshininews
వైభవంగా అన్నకూట్ మహోత్సవం
వైభవంగా అన్నకూట్ మహోత్సవం - గోశాలలో గోవులకు నైవేద్యం సమర్పణ - మార్వాడి సమాజం ఆధ్వర్యంలో ఉత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని గోశాలలో నిర్వహించిన అన్నకూట్ మహోత్సవం వైభవంగా జరిగింది. అధికమాసం సందర్భంగా గురువారం తాండూరు మార్వాడి సమాజంలోని అన్ని సంఘాల ఆధ్వర్యంలో అన్నకూట్ మహోత్సవం నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా గోశాలలోని ఆవులకు వివిధ రకాల కూరగాయలు, పండలు, లడ్డులు, పోలెలు, పాయసం తదితర వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అన్నకూట్ ఉత్సవంలో భాగంగా గోశాలలో కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులతో చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మార్వాడి సమాజం సభ్యులు గోశాలలో పనిచేస్తున్న వారికి కొత్త దుస్తులను పంపిణీ చేశారు. అదేవిధంగా గోశాల సమితి సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళ మండలి అధ్యక్షురాలు సంతోష్ రాఠి, కార్యదర్శి కిషోరీ గగ్రాని, కోశాధికారి శోభా సార్డా. ఉపాధ్యక్షురాలు కిరణ్ సార్డా, సభ్యులు హేమ సోని, వైజయంతి బూబ్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19022