schedule Monday, July 06, 2026

ఘనంగా రితేషన్న జన్మదినం

calendar_today August 4, 2023
person dharshininews
ఘనంగా రితేషన్న జన్మదినం
ఘనంగా రితేషన్న జన్మదినం - ఆలయాల్లో పూజలు, ఆసుపత్రిలో పండ్ల పంపిణీ - అభిమానుల సమక్షంలో కేక్‌ కటింగ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు పంజుగుల రితేష్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు అనిల్ బాండ్ ఆధ్వర్యంలో సందడిగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రితేషన్న జన్మదినం సందర్భంగా నేతలు, అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్‌ కటింగ్‌ అట్టహాసంగా చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో రితేష్ రెడ్డికి వీడియో కాల్ చేసి.. కేక్‌ను కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఒకరినొకరు కేక్ తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పటోళ్ల గంగాధర్, జావేద్ హుస్సేన్,కల్వరాజ వంశీ, రఫిక్, ఇలియాస్, రజక నరసింహ, అబ్రహార్ లాల, సందీప్ రెడ్డి, ఎబినేజర్, శేఖర్, అర్జున్, అశోక్, రాజు, దీపక్ ఠాకుర్, ఇమ్ము, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19047