schedule Monday, September 21, 2026

బీజేపీ కుట్రలకు చెంపపెట్టు

calendar_today August 4, 2023
person dharshininews
బీజేపీ కుట్రలకు చెంపపెట్టు
బీజేపీ కుట్రలకు చెంపపెట్టు - రాహుల్ గాంధీ కేసులో స్టే హర్షణీయం - తాండూరు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాహుల్ గాంధీ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే బీజేపీ కుట్రలకు చెంపపెట్టులాంటిదని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు స్టే ఇచ్చి ఊరట లభించడంపై ప్రభాకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన సభ్యత్వంను పునరుద్దించాలనడం సంతోషకరమన్నారు. శుక్రవారం ప్రభాకర్ గౌడ్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ సూరత్‌లో రాహుల్ గాంధీపై బీజేపీ ఆక్రమ కేసు వేయడం దుర్మార్గమన్నారు. కేంద్రం వ్యతిరేక విధానాలను ఎత్తిచూపినందుకు అన్యాయంగా రాహుల్ గాంధీపై వేసిన కేసు ఇప్పుడు చిత్తుగా మారిందన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంలో బీజేపీ కుట్రలు చేసిందన్నారు. చివరకు సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి స్టే లభించడం కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందన్నారు. బీజేపీ ఎంత దుర్మార్గంగా నడుచుకున్నా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. దేశంలోని ప్రజలు కేంద్రం పాలనను అంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో అందరు కాంగ్రెస్ కు మద్దతుగా నిలవడం ఖాయమన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19052