schedule Monday, July 06, 2026

విరబూసిన బ్రహ్మకమలాలు

calendar_today August 13, 2023
person dharshininews
విరబూసిన బ్రహ్మకమలాలు
విరబూసిన బ్రహ్మకమలాలు - తాండూరులో రెండో సారి దర్శనం - పూజలు నిర్వహించిన ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎంతో పవిత్రమైన బ్రహ్మ కమలాలు మళ్లీ విరబూశాయి. తాండూరులో గత కొన్ని రోజుల క్రితం వివిధ ప్రాంతాల్లోని నివాసాల్లో బ్రహ్మకమలాలు విరబూసిన సంగతి తెలిసిందే. తాజాగా తాండూరు పట్టణంలోని కరణం భూపాల్ రావు అనే యువకుడి ఇంట్లో పెంచుకున్న మొక్కకు బ్రహ్మకమలాలు విరశాయి. రెండోసారి ఇంట్లో బ్రహ్మ కమలాలు విరబూయడంతో కుటుంభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. అదేవిధంగా పెద్దేముల్ మండలం ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డి బాబాయి ఇంట్లో కూడా బ్రహ్మకమలాలు విరబూశాయి. దీంతో కుటుంబ సభ్యులకు బ్రహ్మ కమలాలకు పూజలు నిర్వహించారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని న్యూ నలంద స్కూల్ సమీపంలోని షీటీం ఇంచార్జ్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్ నివాసం వద్ద కూడా బ్రహ్మ కమలాలు విరబూశాయి. ఎంతో పవిత్రమైన బ్రహ్మ కమలాలు విరబూయడంతో శుభసూచకమని, దర్శించుకుని పూజించడం మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. గతంలో కూడా సాయిపూర్, మారికాంబ కాలనీ, హేరూర్ వార్డు తదితర ప్రాంతాల్లో కూడా బ్రహ్మ కమలాలు విరబూశాయి. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19263