schedule Monday, July 06, 2026

తాండూరు మండల ముదిరాజ్ యువజన సంఘం ఎన్నిక

calendar_today August 13, 2023
person dharshininews
తాండూరు మండల ముదిరాజ్ యువజన సంఘం ఎన్నిక
తాండూరు మండల ముదిరాజ్ యువజన సంఘం ఎన్నిక అధ్యక్షులుగా నాటికేరి శ్రీను, ప్రధాన కార్యదర్శిగా నగేష్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల ముదిరాజ్ యువజన సంఘం ఎన్నిక జరిగింది. ఆదివారం మండలంలోని నారాయణ పూర్ గ్రామంలో సమావేశం నిర్వహించారు. ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు లొంక నర్సింలు ముదిరాజ్, బషీరాబాద్ మండల ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో తాండూరు మండల ముదిరాజ్ యువజన సంఘంను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నాటికేరీ శ్రీను, ఉపాధ్యక్షులుగా తలారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దుకాణ్ నగేష్, కార్యదర్శులుగా బోయిని నవీన్, కోటకొండ లక్ష్మణ్, శ్రీధర్, సంయుక్త కార్యదర్శి లవ కుమార్, సలహదారులుగా తలారి శ్రీనివాస్, కోరుకుంది జయంత్‌, తలారీ శ్రీశైలం, సంగెపల్లి వెంకటప్పలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19285