schedule Monday, July 06, 2026

జెండా ఆవిష్కరణలో జగడం..!

calendar_today August 15, 2023
person dharshininews
జెండా ఆవిష్కరణలో జగడం..!
జెండా ఆవిష్కరణలో జగడం..! - చైర్‌ పర్సన్, వైస్ చైర్ పర్సన్ వర్గం వాగ్వివాదం - ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోవడంపై అభ్యంతరం - ఎమ్మెల్యే ముందు ఇరువురి వాగ్వివాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ వర్గం మద్య మరోసారి వర్గవిభేధాలు బయటపడ్డాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముందే చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఆమె భర్త పట్లోళ్ల నర్సింలులు వాగ్వివాదానికి దిగారు. మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలను పురస్కరించుకుని గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ జాతీయ జెండాను ఆవి ష్కరించారు. అక్కడి నుంచి పాత తాండూరు అంబేద్కర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన జెండా వందనం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. అక్కడా కూడా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ జెండా ఆవిష్కరించేందుకు సిద్దమవుతుండగా వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, ఆమె భర్త పట్లోళ్ల దీపా నర్సింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేడుకలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారని, ఎమ్మెల్యే చేత జెండా ఆవిష్కరణకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే గారికి అవకాశం ఇవ్వాలని అడగడానికి మీరెవరు అంటూ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, ఆమె భర్త పట్లోళ్ల నర్సింలుపై అసహనం వ్యక్తం చేశారు. మాట మాట పెరగడంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముందే ఇరువురికి వాగ్వివాదం జరిగింది. అనంతరం, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గౌరవంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి జాతీయ జెండాను అందించి ఆవిష్కరించాలని కోరారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కింద వీడియో కూడా ఉంది. [video width="848" height="480" mp4="https://dharshininews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Video-2023-08-15-at-14.38.39.mp4"][/video]   ఇది కూడా చదవండి... https://dharshininews.com/19331