schedule Sunday, September 20, 2026

అట్టహాసంగా విఠల్‌ రెడ్డి జన్మదినం

calendar_today August 15, 2023
person dharshininews
అట్టహాసంగా విఠల్‌ రెడ్డి జన్మదినం
అట్టహాసంగా విఠల్‌ రెడ్డి జన్మదినం - శుభకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్ - ఎమ్మెల్యే సమక్షంలో సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పంజుగుల విఠల్‌ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టమాసంగా జరిగాయి. మంగళవారం తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని, ఆయన తండ్రి విఠల్‌ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం విఠల్ రెడ్డి చేత విఠల్ నాయక్ కేక్ కట్ చేయించారు. విఠల్ నాయక్ విఠల్ రెడ్డికి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో పాటు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19335