schedule Monday, July 06, 2026

గృహలక్ష్మి దరఖాస్తుల విచారణ ముమ్మరం

calendar_today August 16, 2023
person dharshininews
గృహలక్ష్మి దరఖాస్తుల విచారణ ముమ్మరం
గృహలక్ష్మి దరఖాస్తుల విచారణ ముమ్మరం - వార్డుల్లో పరిశీలిస్తున్న మున్సిపల్ సిబ్బంది తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో గృహలక్ష్మీ పథకం దరఖాస్తుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ ప్లాట్ ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మీ కింద రూ. 3 లక్షల సాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోని 36 వార్డుల నుంచి గృహలక్ష్మీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల నుంచి 1195 మంది లబ్దిదారులు దరఖాస్తులను సమర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది తాండూరు పట్టణంలో లబ్దిదారుల దరఖాస్తుల విచారణ చేపట్టారు. రెండు, మూడు రోజులుగా విచారణ ప్రక్రియ వేగంగా కొనసాగుతో చింది. బుధవారం కూడా పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులు. సిబ్బంది విచారణ చేపట్టారు. దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులకు ఓపెన్ ప్లాట్ ఉందా లేదా, స్థలం మహిళ పేరు ఉందా లేదా అనే వివరాలతో పాటు మహిళలు వితంతువులు కాదా అనే వివరాలను సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19370