schedule Monday, July 06, 2026

వైభవంగా నిత్య అగ్ని హోత్రం

calendar_today August 17, 2023
person dharshininews
వైభవంగా నిత్య అగ్ని హోత్రం
వైభవంగా నిత్య అగ్ని హోత్రం - పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - తాండూరులో శ్రావణ శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ఆర్య సమాజ్‌లో వైభవంగా నిత్య అగ్నిహోత్రం జరిగింది. గురువారం శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నిత్య అగ్ని హోత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. అగ్ని హోత్రం వద్ద కూర్చుని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజలు నిర్వహించారు. మంత్రోచ్చరణల మద్య అగ్ని హోత్రం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, సరిత దంపతులతో పాటు మరి కొందరు దంపతులు అగ్ని హోత్ర పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ శ్రావణమాసం సకల శుభాలకు నెలవన్నారు. తాండూరు సుభీక్షం కోసం అగ్నిహోత్రం ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు. శివునికి అభిషేకం చేసిన కౌన్సిలర్ మరోవైపు శ్రావణ మాసం మొదటి రోజు సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ శివునికి అభిషేకం నిర్వహించారు. పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వెలసిన శివునికి సతీసమేతంగా శివునికి అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని శివున్ని ప్రార్ధించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19379