schedule Saturday, September 19, 2026

ప్రగతి సాధకుడుపై పైలెట్ ..!

calendar_today August 23, 2023
person dharshininews
ప్రగతి సాధకుడుపై పైలెట్ ..!
ప్రగతి సాధకుడుపై పైలెట్ ..! - ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ ఖాయం - శుభకాంక్షలు తెలిపిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నడూ లేని విధంగా తాండూరు నియోజకవర్గంను అభివృద్ధి బాటలో నడిపిన ప్రగతి సాధకుడు పైలెట్ రోహిత్ రెడ్డి అని, వచ్చే ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీ ఖాయమని తాండూరు బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి టిక్కెట్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు, రియల్ ఏస్టేట్ వ్యాపారి గౌరి రాములు, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహర గౌడ్, నవాజ్‌ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ టిక్కెట్టు సాధించుకున్న సందర్భంగా పుష్పగుచ్చం అందించి.. శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నెరవేర్చడమే కాకుండా అన్ని వర్గాల వారి సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఆయన పనితనంతో ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందించడం ఖాయమన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19581