schedule Saturday, September 19, 2026

చంద్రయాన్-3 సక్సెస్ స్పూర్తి దాయకం

calendar_today August 23, 2023
person dharshininews
చంద్రయాన్-3 సక్సెస్ స్పూర్తి దాయకం
చంద్రయాన్-3 సక్సెస్ స్పూర్తి దాయకం - ఇస్రో శాస్త్రవేత్తల కృషి గర్వకారణం - మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్‌ దేశానికి ఎంతో స్పూర్తిదాయకమని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ అన్నారు. బుధవారం చంద్రయాన్-3 చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్త కృషి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ ఘనతను సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరించడం, ఇస్త్రో శాస్త్రవేత్తల అచంచలమైన స్ఫూర్తికి, సంకల్పానికి దేశం మొత్తం వందనం చేస్తోందన్నారు. చంద్రయాన్-3 విజయవంతంతో చంద్రుని దక్షిణ ఉపరితలంపై కాలుమోపిన తొలి దేశంగా భారత దేశం నిలువడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. భారత దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపిన శాస్త్ర వేత్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అన్ని పరిశోధనల్లో భారత్ ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19595