schedule Saturday, September 19, 2026

నేడు, రేపు ఉర్షే షరీఫ్ ఉర్సు వేడుకలు

calendar_today August 31, 2023
person dharshininews
నేడు, రేపు ఉర్షే షరీఫ్ ఉర్సు వేడుకలు
నేడు, రేపు ఉర్షే షరీఫ్ ఉర్సు వేడుకలు - ముర్షద్‌ దర్గాలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ముర్షద్‌ దర్గాలో నేడు, రేపు 77వ ఉర్సే షరీఫ్‌ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహకులు సయ్యద్ అబ్దుల్ గఫ్పూర్ పాష, సయ్యద్ జుబేర్ పాష(మున్సిపల్ మాజీ కౌన్సిలర్) తెలిపారు. దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీమ్ సాహెబ్ ఖిబ్లా చిప్తే ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 77వ ఉర్సే షరీఫ్, సజ్జాద హజ్రత్‌ సయ్యద్ జబ్బార్‌ పాషల ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. నేడు రాత్రి హజ్రత్ సయ్యద్ అబ్దుల్ జబ్బార్ పాష నివాసంలో విందు జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రేపు శుక్రవారం రాత్రి ఫాతేహాఖ్వాని ఉంటుందని, అనంతరం విందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, హజ్రద్ సయ్యద్ అబ్దుల్ కరీం శిష్యుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. కావున ఉత్సవాలలో అందరు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19801