schedule Saturday, September 19, 2026

అమ్మాయిలకు బీఆర్ఎస్వీ అండ

calendar_today September 1, 2023
person dharshininews
అమ్మాయిలకు బీఆర్ఎస్వీ అండ
అమ్మాయిలకు బీఆర్ఎస్వీ అండ - ప్రభుత్వ కాలేజీలో రక్షాబంధన్ సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: అమ్మాయిలకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అండగా ఉంటుందని తాండూరు బీఆర్ఎస్వీ నేతలు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్వీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ ఇంచార్జ్ జిలాని, పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, నేతలకు కళాశాల విద్యార్థినిలు రాఖీ కట్టారు. అనంతరం సందీప్ రెడ్డి మాట్లాడుతూ అమ్మాయిలకు బీఆర్ఎస్వీ తరుపునా అండగా ఉంటామన్నారు. విద్యార్ధిని సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో కృషి చేస్తామని భరోసా అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ పట్టణ ఉపాధ్యక్షులు అఖీఫ్, ప్రధాన కార్యదర్శి నాసిర్ ఖాన్, కార్యదర్శి సోయబ్, యువనాయకులు రజక నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19834