schedule Saturday, September 19, 2026

మంత్రి, ఎమ్మెల్యేతో తాండూరు అభివృద్ధి

calendar_today September 2, 2023
person dharshininews
మంత్రి, ఎమ్మెల్యేతో తాండూరు అభివృద్ధి
మంత్రి, ఎమ్మెల్యేతో తాండూరు అభివృద్ధి - మంత్రి మహేందర్ రెడ్డికి ఏఎంసీ చైర్మన్ విఠల్‌ నాయక్ శుభకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల భూగర్భ శాఖ మంత్రి డా. మహేందర్ రెడ్డికి తాండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటి చైర్మన్ విఠల్‌ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి మహేందర్ రెడ్డితో చైర్మన్ విఠల్‌ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్బంగా పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విఠల్నా యక్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మహేందర్ రెడ్డి అనేక నిధులు తీసుకువచ్చి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల సహకారంతో తాండూరు అభివృద్ధి చెందుతుందన్నారు. మరోవైపు రేపు ఆదివారం తాండూరులో నిర్వహిస్తున్న భారీ ర్యాలీ, సభను జయప్రదం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, కమల్పూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అనంతయ్య ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19858