schedule Sunday, September 20, 2026

మెడికల్‌ అసోసియేషన్‌కు భూమి

calendar_today September 14, 2023
person dharshininews
మెడికల్‌ అసోసియేషన్‌కు భూమి
మెడికల్‌ అసోసియేషన్‌కు భూమి - ఐఎంఏ భవనానికి స్థలం కేటాయింపు - హర్షం వ్యక్తం చేసిన అసోసియేషన్ వైద్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మెడికల్ అసోసియేషన్‌కు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో భూమి కేటాయించారు. ఇండియన్ మెడికల్ అసోసియేష్ (ఐఎంఏ) తాండూరు శాఖ భవన నిర్మాణానికి స్థలం కేటాయించారు. గురువారం తాండూరు ఐఎంఏ అధ్యక్షులు డా. మల్లికార్జున్, కార్యదర్శి డా. అమీర్ తో పాటు తదితరులు స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న సర్వేనెం.52లో బైపాస్ రోడ్డు మార్గం స్థలాన్ని కేటాయించినట్లు సభ్యులు తెలిపారు. 10 గుంటల భూమిని కేటాయించినట్లు వివరించారు. తాండూరు భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకారం అందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు డా.జయప్రసాద్, డా. శివ మోహన్ రెడ్డి, డా. వివేక్, డా.అనిల్ కుమార్, డా.. శెట్టి వైశాలి, డా. శరత్ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20243/