schedule Saturday, July 04, 2026

కీడా కోలా..హలం..!

calendar_today November 6, 2023
person dharshininews
కీడా కోలా..హలం..!
కీడా కోలా..హలం..! - సందడి చేసిన యాక్టర్ హెచ్ఎంటీ - తాండూరులో అభిమానులతో సినిమా తాండూరు, దర్శిని ప్రతినిధి: డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కీడా కోలా. క్రైమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో నటించిన తాండూరు పట్టణానికి చెందిన యాక్టర్ హెచ్ఎంటీ(హన్మంతు) సందడి చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీమహాల్ థియేటర్ లో ప్రదర్శిస్తున్న కీడా కోలా మూవిని అభిమానులతో కలిసి వీక్షించారు. దీంతో థియేటర్ వద్ద కొలాహలం ఏర్పడింది. అనంతరం హెచ్ఎంటీ అభిమానులతో సెల్ఫీలు, ఫోటోలు దిగి సందడి చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎంటీ మాట్లాడుతూ సూపర్ హిట్ సినిమాగా దూసుకెళుతున్న కీడా కోలా మూవీలో తనకు అవకాశం కల్పించడం పట్ల డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కు థ్యాంక్స్ చెప్పారు. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో రూపొందిన చిత్రంలో నటించడంతో పాటు సినిమాలో తన పాత్ర ద్వారా బ్రేక్ వస్తోందని ఆశించారు, ఇంకా కొన్ని సినిమాలలో నటించడం జరుగుతుందని చెప్పారు. మరోవైపు తాండూరు పట్టణానికి చెందిన హెచ్ఎంటీ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21615/