schedule Wednesday, July 08, 2026

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

calendar_today November 14, 2023
person dharshininews
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం - ప్రకటించిన విద్యుత్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు తాండూరులో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు డీఈ భానుప్రసాద్ తెలిపారు. మంగళవారం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. 220/132/33కేవీ మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు తాంఊడరు మున్సిపల్‌తో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్, కోట్‌పల్లి, బంటారం మండలాల్లో బుధవారం ఉదయం 6-30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నట్లు వివరించారు. కావున ప్రజలు, విద్యుత్ వినియోగ దారులు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.   ఇదికూడా చదవండి.. https://dharshininews.com/21910/