schedule Saturday, September 05, 2026

లాస్‌ అయిన మోబైల్ ఫోన్ ట్రేస్..!

calendar_today March 6, 2024
person dharshininews
లాస్‌ అయిన మోబైల్ ఫోన్ ట్రేస్..!
లాస్‌ అయిన మోబైల్ ఫోన్ ట్రేస్..! - వినియోగదారుడుకు అప్పగించిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత లాస్‌(పోగొట్టుకన్న) అయిన మోబైల్ ఫోన్ల ట్రేస్ ఈజీగా అయిపోతోంది. తాజాగా ఓ వినియోగదారుడు పోగొట్టుకున్న మోబైల్ ఫోన్ ను తాండూరు పోలీసులు తిరిగి అప్పగించారు. పట్టణ ఎస్ఐ కాశినాథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనుముల కిష్టప్ప అనే వ్యక్తి గత నెల 22న తాండూరు నుంచి పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి వెళుతుండగా మోబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఈఐఆర్ వ్యవస్థతో మోబైల్‌ ను ట్రేస్ చేసి గుర్తించారు. దీంతో బుధవారం పట్టణ పోలీస్టేషన్‌ లో ఎస్ఐ కాశినాధ్ చేతుల మీదుగా వినియోగదారునికి అందజేశారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/24286/