schedule Saturday, July 04, 2026

డిజిటల్ ఓటర్ ఐడీ ఈజీ..!

calendar_today April 13, 2024
person dharshininews
డిజిటల్ ఓటర్ ఐడీ ఈజీ..!
డిజిటల్ ఓటర్ ఐడీ ఈజీ..! - రిజిస్ట్రేషన్‌ చేసుకుని డౌన్‌లోడ్‌ - ఎలా చేసుకోవాలంటే..? దర్శిని డెస్క్ : ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌గా మారుతోంది. మనిషికి అవసరమయ్యే పలు డాక్యుమెంట్లను డిజిటల్‌ కార్డులుగా మార్చుకుంటున్నారు. ఇండియాలో ఇప్పటికే ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డులను డిజిటల్ కార్డులుగా మార్చుకుంటున్నారు. అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డులు తప్పనిసరిగా ఉంటాయి కానీ.. డిజిటల్ ఓటరు ఐడీ కార్డు ఉండకపోవచ్చు. అలాంటి వారికోసం డిజిటల్ ఓటర్ ఐడీ ఎలా పొందాలి.. డౌన్ లోడ్ ఎలా చేసుకోవాలి అనే విషయాలను మీకు అందిస్తున్నాం. డిజిటల్ ఓటరు ఐడీ కార్డు పొందాలంటే.. ముందుగా.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ htttp://voters.eci.gov.in/loginలోకి వెళ్లాలి. అక్కడ మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ ఇచ్చాక OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే పాస్ వర్డ్ సెట్ చేసుకోమని చెబుతుంది. పాస్ వర్డ్ సెట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. తర్వాత మొబైల్ నంబర్,పాస్ వర్డ్ వచ్చికింద కనిపించే కాప్చా నంబర్ ఎంటర్ చేస్తే లాగిన్ కావొచ్చు. మొబైల్ నంబర్, పాస్ వర్డ్ ఇచ్చి కింద కనిపించే కాప్చా నంబర్ ఎంటర్ చేశాక Request OTP పై క్లిక్ చేయాలి. మొబైల్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి Verify & login పై క్లిక్ చేయాలి. మీకు సైట్ లో కుడివైపు కింద మూలన ఉన్న E-EPI download పై క్లిక్ చేయాలి. ఇప్పుడు విండోలో కనిపించే Enter EPIC NO దగ్గర మీ ఓటర్ ఐడీ కార్డుకి సంబంధించిన ఎపిక్ నంబర్ ను ఎంటర్ చేయాలి. తర్వాత Select State లో మీ రాష్ట్రం పేరును సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్ బాక్స్ క్లిక్ చేయాలి. సెర్చ్ బాక్స్ క్లిక్ చేయగానే మీ ఓటర్ ఐడీకి సంబంధించిన వివరాలను చూపిస్తుంది. ఆ వివరాలు సరైనవే అని నిర్ధారించుకొని కింద ఉన్న Send OTP ని క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయగానే Verify బాక్స్ క్లిక్ చేయాలి. తర్వాత Download e -EPIC క్లిక్ చేయడం ద్వారా మీ డిజిటల్ ఓటరు ఐడీని పొందవచ్చు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25504/