schedule Tuesday, July 07, 2026

మృతునికి కుటుంబానికి బీఎస్ఆర్ చేయూత

calendar_today May 29, 2024
person dharshininews
మృతునికి కుటుంబానికి బీఎస్ఆర్ చేయూత
మృతునికి కుటుంబానికి బీఎస్ఆర్ చేయూత - అనుచరుల ద్వారా ఆర్థిక సాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్న కుటుంబాలకు తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) చేయూతనిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా యాలాల మండలం సంగెంకుర్దు గ్రామానికి చెందిన ఎ.బలప్ప ఇటీవలే మరణించారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఆర్థిక చేయూతనందించారు. బీఎస్ఆర్ టీం సభ్యుల ద్వారా కుటుంబానికి రూ. 6వేల నగదును అందజేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మరణించిన బాలప్ప ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు టీం సభ్యులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26848/