ఎస్ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు..!
July 7, 2026
dharshininews
ఎస్ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు..!
- తప్పులు దొర్లకుండా ఫారాలు పూర్తి చేయించాలి
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారం
- తాండూరులో నమోదు ప్రక్రియ పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
మంగళవారం తాండూరు పట్టణంలో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పోలింగ్ స్టేషన్ల వారిగా పర్యటించారు. ఆయా కేంద్రాలలో బీఎల్‌ఓలు చేస్తున్న నమోదును ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వార్డుల్లో ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలలో ఓటర్లు వివరాలు ఎలా నమోదు చేయిస్తున్నారని బీఎల్‌ఓలను విచారించారు. ఎస్‌ఐఆర్ నమోదును నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. ప్రతి ఓటరుకు నమోదుపై అవగాహన కల్పించాలని అన్నారు.
పారదర్శకంగా వివరాలను నమోదు చేయించాలని అన్నారు. అందరి సమన్వయంతో ఎస్‌ఐఆర్‌ను పూర్తి చేయించాలని అన్నారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యేలా దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ వెంట తాండూరు ఆర్డీఓ అనిత, తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ కమీషనర్ రాకేష్ రెడ్డి, బీఎల్‌ఓలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
https://www.dharshininews.com/43712/