అమ్మ.. ఎడబాటుకు తెర..!
July 7, 2026
dharshininews
అమ్మ.. ఎడబాటుకు తెర..!
- వీడిన మహిళ కూలీ మిస్సింగ్ మిస్టరీ
- నెలరోజులకు ఇంటికి చేరుకున్న తల్లీ
- కూతుళ్ల చెంతకు చేర్చిన పోలీసులు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : నెల రోజులుగా అదృశ్యమై అమ్మ ప్రేమకు దూరమైన కూతుళ్ల ఎడబాటుకు తెరపడింది. ఎట్టకేళకు కూతుళ్ల చెంతకు చేరుకోవడంతో కథ సుఖాంతం అయ్యింది.
బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామంలో మిస్స్ అయిన మహిళ కూలీ మిస్సింగ్ మిస్టరీ వీడింది. గ్రామస్తుల సహాకారంతో పోలీసులు మహిళ కూలీని గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే... బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామానికి చెందిన ఏనుముల మహేశ్వరి(35) భర్త లేకపోవడంతో దినసరి వలస కూలీగా పనిచేస్తోంది.
కూలీ పనుల్లో భాగంగా వికారాబాద్ వెళ్ళేది. గత నెల 8వ తేదిన ఉదయం కూలీ పనికోసమని మహేశ్వరి వికారాబాద్ వెళ్లింది. ఆరోజు నుంచి ఇంటికి తిరిగి రాలేదు. మహేశ్వరి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వికారాబాద్, శంకర్‌పల్లితోపాటు పలు ప్రాంతాలలో వెతికిన ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి ఆమె కూతుళ్లు అలకనంద(10), భువనేశ్వరీ(12)లు తల్లీ అదృశ్యం కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆమె అత్త, మామల వద్ద ఉంటున్నారు. మహేశ్వరి సోదరుడు వీరప్ప గత 13వ తేదిన బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా అదృశ్యమైన మహేశ్వరి తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యక్షం అయ్యింది. గమనించిన జీవన్గీ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఎస్ఐ విఠల్ మహేశ్వరిని తీసుకవచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో మహిళ కూలీ అదృశ్యం కథ సుఖాంతం అయ్యింది. తల్లీ తమ చెంతకు చేరడంతో కూతుళ్లు సంతోషం వ్యక్తం చేశారు.
https://www.dharshininews.com/43715/