schedule Tuesday, July 07, 2026

కట్టమైసమ్మకు కిలో వెండి కీరీటం

calendar_today June 6, 2024
person dharshininews
కట్టమైసమ్మకు కిలో వెండి కీరీటం
chai jrకట్టమైసమ్మకు కిలో వెండి కీరీటం - ఆలయ దొంగలను పట్టుకుంటే రూ.51 వేలు - ప్రకటించిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ - ఆలయంలో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్లో వెలసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి కిలో వెండితో కీరీటం చేయిస్తామని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. అదేవిధంగా ఆలయంలో అమ్మవారి నగలను ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకుంటే రూ. 51 వేల నగదును అందజేస్తానని ప్రకటించారు. కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రతి అమావాస్యకు అల్లంపల్లి ప్రకాష్, కుమ్మరి నర్సింలుల ఆధ్వర్యంలో గత 19 నెలలుగా అన్నదానం నిర్వహిస్తున్నారు. గురువారం అమావాస్య సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి విఠల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయంలో వెలసిన అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ కట్టమైసమ్మ తల్లి ఎంతో మహిమాన్వితురాలని అన్నారు. ఆలయంలో అమ్మవారి నగలను దోచుకెళ్లడం. మహాపాపం అని అన్నారు. దొంగలను పోలీసులు త్వరగా పట్టుకోవాలని కోరారు. అదేవిధంగా అమ్మవారికి కిలో వెండితో కీరీటం చేయించి బహుకరిస్తామన్నారు. ఆలయ దొంగలను పట్టుకుంటే రూ. 51 వేల నగదును సొంతంగా అందిస్తానని ప్రకటించారు. మరోవైపు ఆలయంలో అన్నదానం చేస్తున్న ప్రకాష్, నర్సింలులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి ముఖ్య సలహాదారులు పాపయ్య, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, అంజయ్య, మెకానిక్ సుధాకర్, ఆలయ పూజారి, భక్తులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27044/