schedule Monday, September 14, 2026

పైలెట్‌కు అస్వస్థత..!

calendar_today June 9, 2024
person dharshininews
పైలెట్‌కు అస్వస్థత..!
chai jrపైలెట్‌కు అస్వస్థత..! - ఆసుపత్రిలో చేరిన రోహిత్ రెడ్డి - ఆరోగ్యంపై తండ్రి ఏమన్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత పైలెట్ రోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో హుటా హుటిన రోహిత్ రెడ్డి స్వదేశానికి చేరుకున్నారు. శనివారం అర్దరాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కుటుంభ సభ్యులు కూడా వెంటనే ఆసుపత్రికి తరలివెళ్లారు. వైరల్‌ ఫీవర్ కారణంగా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి మాట్లాడుతూ పైలెట్ రోహిత్ రెడ్డి అనారోగ్యంపై ఆందోళన చెందొద్దన్నారు. రోహిత్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27078/