schedule Tuesday, July 07, 2026

అంతా భాగానే ఉంది..!

calendar_today June 9, 2024
person dharshininews
అంతా భాగానే ఉంది..!
chai jrఅంతా భాగానే ఉంది..! - త్వరలోనే తాండూరుకు వస్తా - బెడ్‌ పైనుంచే రోహిత్ రెడ్డి సందేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవ్వరు ఆధైర్య పడకండి.. మీ అభిమానం.. ఆశీర్వాదాలతో అంతా భాగానే ఉందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన సంఘటన ఆదివారం వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై రోహిత్ రెడ్డి స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బెడ్‌ పైనుంచే మాట్లాడుతూ విడీయో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ప్రజలందరి అభిమానం, ఆశీర్వాదాలతో కోలుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. జ్వరం కారణంగానే ఆసుపత్రిలో చేరడం జరిగిందన్నారు. రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతానని, త్వరలోనే తాండూరుకు వస్తానని తెలిపారు. ప్రజలు, అభిమానులు ఎవ్వరు ఆధైర్య పడొద్దని అన్నారు. [video width="848" height="478" mp4="https://www.dharshininews.com/wp-content/uploads/2024/06/rohith-reddy.mp4"][/video] ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/27081/